పరిశుద్ధ గ్రంథము

1 దినవృత్తాంతములు 11

1 Chronicles 11

చదవడం

1 దినవృత్తాంతములు 11

1

అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చిచిత్తగిం చుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.

🎙 రికార్డ్
2

ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివినా జనులగు ఇశ్రాయేలీ యులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.

🎙 రికార్డ్
3

ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూ యేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.

🎙 రికార్డ్
4

తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.

🎙 రికార్డ్
5

అప్పుడునీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.

🎙 రికార్డ్
6

ఎవడు మొదట యెబూ సీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.

🎙 రికార్డ్
7

తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.

🎙 రికార్డ్
8

దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.

🎙 రికార్డ్
9

​సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.

🎙 రికార్డ్
10

​ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకా రము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యము నందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.

🎙 రికార్డ్
11

​దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు;ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.

🎙 రికార్డ్
12

ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.

🎙 రికార్డ్
13

ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమీ్మములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.

🎙 రికార్డ్
14

వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.

🎙 రికార్డ్
15

ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.

🎙 రికార్డ్
16

దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.

🎙 రికార్డ్
17

దావీదు ఆశపడిబేత్లెహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా

🎙 రికార్డ్
18

ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ది బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి

🎙 రికార్డ్
19

నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.

🎙 రికార్డ్
20

​యోవాబు సహోదరు డైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.

🎙 రికార్డ్
21

​ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.

🎙 రికార్డ్
22

మరియు కబ్సెయేలు సంబంధుడును పరా క్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమా రుల నిద్దరిని చంపెను;మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.

🎙 రికార్డ్
23

అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేత పట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడ లాగి దానితో వానిని చంపెను.

🎙 రికార్డ్
24

యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.

🎙 రికార్డ్
25

ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.

🎙 రికార్డ్
26

మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,

🎙 రికార్డ్
27

హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

🎙 రికార్డ్
28

​తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

🎙 రికార్డ్
29

​హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,

🎙 రికార్డ్
30

​నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

🎙 రికార్డ్
31

​బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,

🎙 రికార్డ్
32

​గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

🎙 రికార్డ్
33

​​బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,

🎙 రికార్డ్
34

​గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనా తాను,

🎙 రికార్డ్
35

​హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

🎙 రికార్డ్
36

​​మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,

🎙 రికార్డ్
37

కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

🎙 రికార్డ్
38

నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,

🎙 రికార్డ్
39

అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,

🎙 రికార్డ్
40

ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

🎙 రికార్డ్
41

​హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,

🎙 రికార్డ్
42

రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,

🎙 రికార్డ్
43

​మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,

🎙 రికార్డ్
44

​ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీ యేలు,

🎙 రికార్డ్
45

​షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,

🎙 రికార్డ్
46

మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,

🎙 రికార్డ్
47

ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

1 దినవృత్తాంతములు 11

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.