పరిశుద్ధ గ్రంథము

1 సమూయేలు 13

1 Samuel 13

చదవడం

1 సమూయేలు 13

1

సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనా రంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను

🎙 రికార్డ్
2

ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచు కొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.

🎙 రికార్డ్
3

యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.

🎙 రికార్డ్
4

​సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసి నందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గా లులో సౌలు నొద్దకు కూడివచ్చిరి.

🎙 రికార్డ్
5

​ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.

🎙 రికార్డ్
6

​ఇశ్రా యేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.

🎙 రికార్డ్
7

​కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదుదేశ మునకును గిలాదునకును వెళ్లి పోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.

🎙 రికార్డ్
8

​సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి

🎙 రికార్డ్
9

​​దహన బలులను సమాధానబలులను నా యొద్దకు తీసికొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను.

🎙 రికార్డ్
10

​అతడు దహనబలి అర్పించి చాలిం చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా

🎙 రికార్డ్
11

​​సమూ యేలు అతనితోనీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలుజనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి

🎙 రికార్డ్
12

ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను.

🎙 రికార్డ్
13

అందుకు సమూ యేలు ఇట్లనెనునీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమునుఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యము నిలు వదు.

🎙 రికార్డ్
14

​యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.

🎙 రికార్డ్
15

​సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.

🎙 రికార్డ్
16

​సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితో కూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి.

🎙 రికార్డ్
17

​మరియు ఫిలిష్తీ యుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడుగుంపు లుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవుమార్గమున సంచరించెను.

🎙 రికార్డ్
18

​​రెండవ గుంపు బేత్‌ హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరి హద్దు మార్గమున సంచరించెను.

🎙 రికార్డ్
19

​​హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందు రేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండచేసియుండిరి.

🎙 రికార్డ్
20

​​​కాబట్టి ఇశ్రా యేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను.

🎙 రికార్డ్
21

​​​అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకు రాళ్లుమాత్రము వారియొద్ద నుండెను.

🎙 రికార్డ్
22

​​​​కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనా తాను నొద్దను ఉన్నజనులలోఒకని చేతిలోనైనను కత్తియే గాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.

🎙 రికార్డ్
23

​​​​​ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

1 సమూయేలు 13

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.