పరిశుద్ధ గ్రంథము

ఆమోసు 8

Amos 8

చదవడం

ఆమోసు 8

1

మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి

🎙 రికార్డ్
2

ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగావేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికనువారిని విచారణచేయక మానను.

🎙 రికార్డ్
3

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊర కుండుడి.

🎙 రికార్డ్
4

​దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,

🎙 రికార్డ్
5

తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా,

🎙 రికార్డ్
6

దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.

🎙 రికార్డ్
7

యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమా ణము చేయునదేమనగావారిక్రియలను నేనెన్నడును మరువను.

🎙 రికార్డ్
8

ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.

🎙 రికార్డ్
9

​ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.

🎙 రికార్డ్
10

​మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.

🎙 రికార్డ్
11

రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.

🎙 రికార్డ్
12

కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;

🎙 రికార్డ్
13

ఆ దినమందు చక్కని కన్యలును ¸°వనులును దప్పిచేత సొమ్మసిల్లు దురు.

🎙 రికార్డ్
14

​షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయే ర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

ఆమోసు 8

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.