పరిశుద్ధ గ్రంథము

యెహెజ్కేలు 13

Ezekiel 13

చదవడం

యెహెజ్కేలు 13

1

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

🎙 రికార్డ్
2

నరపుత్రుడా, ప్రవచించు చున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవ చించి, మనస్సువచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుముయెహోవా మాట ఆలకించుడి.

🎙 రికార్డ్
3

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాదర్శనమేమియు కలుగ కున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.

🎙 రికార్డ్
4

ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు.

🎙 రికార్డ్
5

యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచు నట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.

🎙 రికార్డ్
6

వారు వ్యర్థమైన దర్శన ములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.

🎙 రికార్డ్
7

నేను సెలవియ్యకపోయిననుఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శ నముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా?

🎙 రికార్డ్
8

కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుమీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థక మైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

🎙 రికార్డ్
9

వ్యర్థ మైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.

🎙 రికార్డ్
10

సమాధానమే మియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

🎙 రికార్డ్
11

ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుమువర్షము ప్రవాహ ముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.

🎙 రికార్డ్
12

ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచిమీరు పూసిన పూత యేమాయె నని అడుగుదురు గదా?

🎙 రికార్డ్
13

ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చు నదేమనగానేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నా కోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,

🎙 రికార్డ్
14

దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.

🎙 రికార్డ్
15

ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నా కోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పని తీరెనని మీతో చెప్పుదును.

🎙 రికార్డ్
16

యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

🎙 రికార్డ్
17

మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవ చించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము

🎙 రికార్డ్
18

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయు స్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.

🎙 రికార్డ్
19

అబద్ధపు మాటల నంగీకరించు నా జనులతో అబద్ధఫు మాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రది కించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.

🎙 రికార్డ్
20

కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక

🎙 రికార్డ్
21

మనుష్యు లను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.

🎙 రికార్డ్
22

మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.

🎙 రికార్డ్
23

మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యెహెజ్కేలు 13

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.