పరిశుద్ధ గ్రంథము

యెహెజ్కేలు 19

Ezekiel 19

చదవడం

యెహెజ్కేలు 19

1

మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులనుగూర్చి ప్రలాపవాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము

🎙 రికార్డ్
2

నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది, ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమసింహముల మధ్య తన పిల్లలను పెంచెను;

🎙 రికార్డ్
3

వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.

🎙 రికార్డ్
4

అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తుదేశమునకు దాని తీసికొనిపోయిరి.

🎙 రికార్డ్
5

తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలిసికొని, తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమ సింహముగా చేసెను.

🎙 రికార్డ్
6

​ఇదియు కొదమసింహమై కొదమ సింహములతో కూడ తిరుగులాడి వేటాడనేర్చుకొని మనుష్యులను భక్షించునదై

🎙 రికార్డ్
7

​వారి నగరులను అవమాన పరచి వారి పట్టణములను పాడుచేసెను; దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను.

🎙 రికార్డ్
8

నలుదిక్కుల దేశపు జనులందరు దాని పట్టుకొనుటకు పొంచి యుండి ఉరి నొగ్గగా అది వారి గోతిలో చిక్కెను.

🎙 రికార్డ్
9

అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసికొని పోయి అతనికి అప్పగించిరి; దాని గర్జనము ఇశ్రాయేలీ యుల పర్వతములమీద ఎన్నటికిని వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి.

🎙 రికార్డ్
10

మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫల భరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లివలె నుండెను.

🎙 రికార్డ్
11

భూపతు లకు దండములైనట్టి గట్టిచువ్వలు దానికి కలిగియుండెను, అది మేఘములనంటునంతగా పెరిగెను, విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను.

🎙 రికార్డ్
12

అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయ బడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.

🎙 రికార్డ్
13

ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి యెండిపోయి నిర్జలస్థలములలో నాట బడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలోనుండి అగ్ని బయలు దేరుచు

🎙 రికార్డ్
14

దాని పండ్లను దహించుచున్నది గనుక రాజ దండమునకు తగిన గట్టిచువ్వ యొకటియు విడువబడ లేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపము నకు కారణమగును.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యెహెజ్కేలు 19

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.