పరిశుద్ధ గ్రంథము

యెహెజ్కేలు 7

Ezekiel 7

చదవడం

యెహెజ్కేలు 7

1

యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.

2

“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు.

3

ఇప్పుడు అంతం మీ పైకి వచ్చింది.

4

నా దృష్టిలో మీ పట్ల ఎలాంటి కనికరమూ చూపను.

5

ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.

6

అంతం వచ్చేస్తూ ఉంది.

7

దేశవాసులారా, మీ నాశనం మిమ్మల్ని సమీపిస్తుంది.

8

త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను.

9

నాకు మీ పట్ల కనికరం లేదు.

10

చూడండి! ఆ రోజు వచ్చేస్తుంది. నాశనం బయలు దేరింది.

11

బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది.

12

ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది.

13

అమ్మినవాడు వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తాను అమ్మిన భూమికి తిరిగి రాడు.

14

వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు.

15

ఖడ్గం బయట ఉంది. లోపలేమో కరవూ, తెగులూ ఉన్నాయి.

16

అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు.

17

వాళ్ళందరి చేతులూ తడబడతాయి. మోకాళ్ళు నీళ్ళలా బలహీనం అవుతాయి.

18

వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది.

19

వాళ్ళు తమ దగ్గర ఉన్న వెండిని వీధుల్లో పారేస్తారు.

20

వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు.

21

వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను.

22

వాళ్ళు నా ఖజానాను అపవిత్రం చేస్తుంటే చూడకుండా నా ముఖం తిప్పుకుంటాను.

23

తీర్పుని బట్టి దేశం రక్తంతోనూ, పట్టణం హింసతోనూ నిండిపోయింది. అందుకే సంకెళ్ళు సిద్ధం చేయండి.

24

జాతుల్లోకెల్లా అత్యంత దుర్మార్గమైన జాతిని నేను పంపుతాను. వాళ్ళు వచ్చి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటారు.

25

భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు.

26

నాశనం తరువాత నాశనం కలుగుతుంది.

27

రాజు విచారంగా ఉంటాడు. యువరాజు నిస్పృహలో సామాన్య వస్త్రాలు ధరిస్తాడు.