పరిశుద్ధ గ్రంథము

ఎజ్రా 10

Ezra 10

చదవడం

ఎజ్రా 10

1

ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట... సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా

🎙 రికార్డ్
2

ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.

🎙 రికార్డ్
3

కాబట్టి యీ పని ధర్మ శాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.

🎙 రికార్డ్
4

​లెమ్ము ఈ పని నీ యధీనములో నున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా

🎙 రికార్డ్
5

ఎజ్రా లేచి, ప్రధాన యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయు లందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా

🎙 రికార్డ్
6

ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయ కుండెను.

🎙 రికార్డ్
7

​చెరనుండి విడుదల నొందినవారందరు యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటనచేయబడెను.

🎙 రికార్డ్
8

మరియు మూడు దినములలోగా ప్రధానులును పెద్దలును చేసిన యోచనచొప్పున ఎవడైనను రాకపోయినయెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందినవారి సమాజములోనుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి.

🎙 రికార్డ్
9

యూదా వంశస్థులందరును బెన్యామీనీయు లందరును ఆ మూడు దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమి్మదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి.

🎙 రికార్డ్
10

అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెనుమీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.

🎙 రికార్డ్
11

కాబట్టి యిప్పుడు మీ పితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసార ముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి.

🎙 రికార్డ్
12

అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరినీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.

🎙 రికార్డ్
13

అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువ లేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను,

🎙 రికార్డ్
14

మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను.

🎙 రికార్డ్
15

అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి.

🎙 రికార్డ్
16

చెరనుండి విడుదలనొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరు లనుబట్టి తమ తమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి.

🎙 రికార్డ్
17

మొదటి నెల మొదటి దిన మున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.

🎙 రికార్డ్
18

యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగాయోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరుల లోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.

🎙 రికార్డ్
19

వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.

🎙 రికార్డ్
20

ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా

🎙 రికార్డ్
21

హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,

🎙 రికార్డ్
22

పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,

🎙 రికార్డ్
23

​లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,

🎙 రికార్డ్
24

గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.

🎙 రికార్డ్
25

​ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,

🎙 రికార్డ్
26

ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.

🎙 రికార్డ్
27

​జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.

🎙 రికార్డ్
28

బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,

🎙 రికార్డ్
29

బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు

🎙 రికార్డ్
30

రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,

🎙 రికార్డ్
31

​హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా

🎙 రికార్డ్
32

​షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా,

🎙 రికార్డ్
33

​హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ,

🎙 రికార్డ్
34

బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు

🎙 రికార్డ్
35

​బెనాయా బేద్యా కెలూహు

🎙 రికార్డ్
36

​​వన్యా మెరేమోతు ఎల్యాషీబు

🎙 రికార్డ్
37

మత్తన్యా మత్తెనై యహశావు

🎙 రికార్డ్
38

బానీ బిన్నూయి షిమీ

🎙 రికార్డ్
39

​షిలెమ్యా నాతాను అదాయా

🎙 రికార్డ్
40

మక్నద్బయి షామై షారాయి

🎙 రికార్డ్
41

అజరేలు షెలెమ్యా షెమర్యా

🎙 రికార్డ్
42

షల్లూము అమర్యా యోసేపు

🎙 రికార్డ్
43

నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు

🎙 రికార్డ్
44

వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

ఎజ్రా 10

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.