పరిశుద్ధ గ్రంథము

ఎజ్రా 2

Ezra 2

చదవడం

ఎజ్రా 2

1

బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి

🎙 రికార్డ్
2

​యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.

🎙 రికార్డ్
3

పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,

🎙 రికార్డ్
4

షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,

🎙 రికార్డ్
5

ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,

🎙 రికార్డ్
6

​పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,

🎙 రికార్డ్
7

ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

🎙 రికార్డ్
8

జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు,

🎙 రికార్డ్
9

జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,

🎙 రికార్డ్
10

బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,

🎙 రికార్డ్
11

బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,

🎙 రికార్డ్
12

అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,

🎙 రికార్డ్
13

అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,

🎙 రికార్డ్
14

బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు;

🎙 రికార్డ్
15

ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,

🎙 రికార్డ్
16

అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,

🎙 రికార్డ్
17

బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,

🎙 రికార్డ్
18

​యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,

🎙 రికార్డ్
19

​హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,

🎙 రికార్డ్
20

గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,

🎙 రికార్డ్
21

బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

🎙 రికార్డ్
22

నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,

🎙 రికార్డ్
23

అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,

🎙 రికార్డ్
24

అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,

🎙 రికార్డ్
25

కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,

🎙 రికార్డ్
26

​రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,

🎙 రికార్డ్
27

​మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

🎙 రికార్డ్
28

​బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,

🎙 రికార్డ్
29

నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,

🎙 రికార్డ్
30

మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,

🎙 రికార్డ్
31

ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

🎙 రికార్డ్
32

హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,

🎙 రికార్డ్
33

లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,

🎙 రికార్డ్
34

​యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,

🎙 రికార్డ్
35

​సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,

🎙 రికార్డ్
36

యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు

🎙 రికార్డ్
37

ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,

🎙 రికార్డ్
38

పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,

🎙 రికార్డ్
39

హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,

🎙 రికార్డ్
40

లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,

🎙 రికార్డ్
41

గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,

🎙 రికార్డ్
42

ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,

🎙 రికార్డ్
43

​నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,

🎙 రికార్డ్
44

కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు,

🎙 రికార్డ్
45

​లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,

🎙 రికార్డ్
46

​హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు,

🎙 రికార్డ్
47

గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,

🎙 రికార్డ్
48

​రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,

🎙 రికార్డ్
49

ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,

🎙 రికార్డ్
50

అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,

🎙 రికార్డ్
51

బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,

🎙 రికార్డ్
52

బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,

🎙 రికార్డ్
53

బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు,

🎙 రికార్డ్
54

​నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,

🎙 రికార్డ్
55

సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,

🎙 రికార్డ్
56

​యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,

🎙 రికార్డ్
57

​​షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,

🎙 రికార్డ్
58

​నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.

🎙 రికార్డ్
59

మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.

🎙 రికార్డ్
60

వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.

🎙 రికార్డ్
61

మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు.

🎙 రికార్డ్
62

వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.

🎙 రికార్డ్
63

మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.

🎙 రికార్డ్
64

సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.

🎙 రికార్డ్
65

వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.

🎙 రికార్డ్
66

వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,

🎙 రికార్డ్
67

వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.

🎙 రికార్డ్
68

కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.

🎙 రికార్డ్
69

పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.

🎙 రికార్డ్
70

యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

ఎజ్రా 2

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.