పరిశుద్ధ గ్రంథము
ఆదికాండము 49
Genesis 49
చదవడం
ఆదికాండము 49
యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి.
రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి,
పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు.
షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు.
వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది.
యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు.
యూదా సింహం పిల్ల.
షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు.
ద్రాక్షావల్లికి తన గాడిదనూ,
అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా,
జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు.
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు.
దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా
దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి,
యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
దోపిడీ గాళ్ళు గాదును కొడతారు.
ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది.
నఫ్తాలి వదిలిపెట్టిన లేడి.
యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ.
విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు.
అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది.
నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన,
నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా,
బెన్యామీను ఆకలిగొన్న తోడేలు.
ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.
హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.
యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.