పరిశుద్ధ గ్రంథము

హబక్కూకు 1

Habakkuk 1

చదవడం

హబక్కూకు 1

1

ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.

🎙 రికార్డ్
2

యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.

🎙 రికార్డ్
3

నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.

🎙 రికార్డ్
4

అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.

🎙 రికార్డ్
5

అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దిన ములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.

🎙 రికార్డ్
6

ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను.

🎙 రికార్డ్
7

వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

🎙 రికార్డ్
8

వారి గుఱ్ఱ ములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడు దురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.

🎙 రికార్డ్
9

​వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.

🎙 రికార్డ్
10

రాజు లను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.

🎙 రికార్డ్
11

తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.

🎙 రికార్డ్
12

​యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.

🎙 రికార్డ్
13

నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

🎙 రికార్డ్
14

ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.

🎙 రికార్డ్
15

వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.

🎙 రికార్డ్
16

కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.

🎙 రికార్డ్
17

వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయు చుండవలెనా?

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

హబక్కూకు 1

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.