పరిశుద్ధ గ్రంథము
హోషేయ 2
Hosea 2
చదవడం
హోషేయ 2
మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి.
మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు.
లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను.
ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు.
వారి తల్లి కులట.
కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను.
అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది.
దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు.
కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను.
దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను.
ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను.
“ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.
అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను.
ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను.
ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను.
“ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు.
ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు.
“ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో,
నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.
యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.
ఆ దినాన నేను జవాబిస్తాను.”
భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా,
నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను.