పరిశుద్ధ గ్రంథము

యెషయా 34

Isaiah 34

చదవడం

యెషయా 34

1

రాజ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఆలకించండి.

2

యెహోవా కోపం రాజ్యాల మీదికి వస్తున్నది, ఆయన ఆగ్రహం వారి సర్వ సేనల మీదికీ వస్తున్నది.

3

వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు.

4

ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది.

5

నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది.

6

యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తం చేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది.

7

వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి.

8

అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం.

9

ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది.

10

అది రాత్రీ, పగలూ ఆరిపోకుండా ఉంటుంది. దాని పొగ ఎల్లప్పుడూ రేగుతూ ఉంటుంది.

11

గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి.

12

రాజ్యం గురించి ప్రకటించడానికి వారి ప్రధానులు అక్కడ ఉండరు.

13

ఎదోము నగరాల్లో ముళ్లచెట్లు పెరుగుతాయి. దాని దుర్గాల్లో దురదగొండ్లు, గచ్చపొదలు ఎదుగుతాయి.

14

క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి.

15

గుడ్లగూబలు గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పొదుగుతాయి.

16

యెహోవా గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించండి.

17

అవి రావాలని ఆయన చీట్లు వేశాడు. ఆయన కొలనూలు పట్టుకుని వాటికి ఆ దేశాన్ని పంచిపెడతాడు.