పరిశుద్ధ గ్రంథము

యిర్మీయా 16

Jeremiah 16

చదవడం

యిర్మీయా 16

1

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

🎙 రికార్డ్
2

ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు.

🎙 రికార్డ్
3

ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

🎙 రికార్డ్
4

వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతు వులకును ఆహారముగా ఉండును.

🎙 రికార్డ్
5

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు

🎙 రికార్డ్
6

ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొన కుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.

🎙 రికార్డ్
7

చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చు టకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రి యైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.

🎙 రికార్డ్
8

వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు.

🎙 రికార్డ్
9

సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుమీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పిం చెదను.

🎙 రికార్డ్
10

నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారుదేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా

🎙 రికార్డ్
11

నీవు వారితో ఇట్లనుముయెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుమీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మ శాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.

🎙 రికార్డ్
12

ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీ పితరులకంటె విస్తారముగా చెడుతనము చేసి యున్నారు.

🎙 రికార్డ్
13

కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీ పితరు లైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.

🎙 రికార్డ్
14

యెహోవా సెలవిచ్చు మాట ఏదనగానేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలోఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట

🎙 రికార్డ్
15

అనకఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీ యులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.

🎙 రికార్డ్
16

ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాల మంది జాలరులను పిలి పించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.

🎙 రికార్డ్
17

ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.

🎙 రికార్డ్
18

వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంత లుగా వారికి ప్రతికారము చేసెదను.

🎙 రికార్డ్
19

యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.

🎙 రికార్డ్
20

నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.

🎙 రికార్డ్
21

​కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్య మును ఎంతటివో వారికి తెలియజేతును.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యిర్మీయా 16

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.