పరిశుద్ధ గ్రంథము

యిర్మీయా 20

Jeremiah 20

చదవడం

యిర్మీయా 20

1

యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని

🎙 రికార్డ్
2

​ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.

🎙 రికార్డ్
3

మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడి పింపగా యిర్మీయా అతనితో ఇట్లనెనుయెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్‌ అని నీకు పేరు పెట్టును.

🎙 రికార్డ్
4

యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడునీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచు చుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసి కొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.

🎙 రికార్డ్
5

ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదా రాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.

🎙 రికార్డ్
6

​పషూరూ, నీవును నీ యింట నివసించువారందరును చెరలోనికి పోవు దురు, నీవును నీవు ప్రవచనములచేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతిపెట్టబడెదరు.

🎙 రికార్డ్
7

​యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరే పణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.

🎙 రికార్డ్
8

​​ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలా త్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతు వాయెను.

🎙 రికార్డ్
9

​​ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృద యములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.

🎙 రికార్డ్
10

నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.

🎙 రికార్డ్
11

అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్న డును మరువబడని నిత్యావమానము పొందుదురు.

🎙 రికార్డ్
12

సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించు చున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక

🎙 రికార్డ్
13

​యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.

🎙 రికార్డ్
14

​నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;

🎙 రికార్డ్
15

నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తు డగును గాక;

🎙 రికార్డ్
16

నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక

🎙 రికార్డ్
17

​యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక

🎙 రికార్డ్
18

​కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యిర్మీయా 20

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.