పరిశుద్ధ గ్రంథము

యిర్మీయా 2

Jeremiah 2

చదవడం

యిర్మీయా 2

1

యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

2

“యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను.

3

అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది.

4

యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి.

5

యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు?

6

‘ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ’ అని అడగలేదు.

7

ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను.

8

“యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు.

9

కాబట్టి నేనికనుండి మీపైనా మీ పిల్లల పైనా వారి పిల్లల పైనా నేరం మోపుతాను. ఇది యెహోవా వాక్కు.

10

కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా?

11

దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు.

12

ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు.

13

నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.

14

ఇశ్రాయేలు ఒక బానిసా? అతడు ఇంటిలో జన్మించిన వాడే కదా? మరెందుకు అతడు దోపుడు సొమ్ముగా మారాడు?

15

కొదమ సింహాలు అతనిపై గర్జించాయి, అతనిపై పెద్దగా అరుస్తూ అతని దేశాన్ని భయకంపితం చేశాయి. అతని పట్టణాలు ప్రజలు నివసించలేనంతగా నాశనం అయ్యాయి.

16

నోపు, తహపనేసు అనే పట్టణాల ప్రజలు నీకు బోడిగుండు చేసి నిన్ను బానిసగా చేసుకున్నారు.

17

నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని విడిచి వేరైపోయి నీకు నీవే ఈ బాధ తెచ్చిపెట్టుకున్నావు గదా?

18

ఐగుప్తు దారిలో వెళ్లి షీహోరు నీళ్లు తాగడానికి నీకేం పని? అష్షూరు దారిలో వెళ్లి యూఫ్రటీసు నది నీళ్లు తాగడానికి నీకేం పని?

19

నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు.

20

పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా “నేను నిన్ను పూజించను” అని చెబుతున్నావు.

21

శ్రేష్ఠమైన ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటాను. నిక్కచ్చి విత్తనం గల చెట్టులాగా నిన్ను నాటాను.

22

నువ్వు నదిలో కడుక్కున్నా, ఎక్కువ సబ్బు రాసుకున్నా నీ దోషం నాకు గొప్ప మరకలాగా కనిపిస్తున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.

23

“నాలో అపవిత్రత లేదు, బయలు దేవుళ్ళ వెనక నేను వెళ్ళడం లేదు” అని నువ్వు ఎలా అనుకుంటున్నావు?

24

అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిదవు. అది కామంతో దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది.

25

నీ పాదాలకు చెప్పులు తొడుక్కుని జాగ్రత్త పడు, నీ గొంతు ఆరిపోకుండా జాగ్రత్తపడు, అని నేను చెప్పాను. కాని “నీ మాట వినను, కొత్తవారిని మోహించాను, వారి వెంట వెళ్తాను” అని చెబుతున్నావు.

26

దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది.

27

వారు నా వైపు నేరుగా చూడకుండా తమ వీపు తిప్పుకున్నారు.

28

నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో.

29

మీరంతా నా మీద తిరగబడి పాపం చేశారు. ఇంకా ఎందుకు నాతో వాదిస్తారు? అని యెహోవా అడుగుతున్నాడు.

30

నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.

31

ఇప్పటి తరం ప్రజలు యెహోవా చెప్పే మాట వినండి, నేను ఇశ్రాయేలుకు ఒక అరణ్యం లాగా అయ్యానా?

32

ఒక కన్య తన ఆభరణాలు మర్చిపోతుందా? పెళ్ళికూతురు తన మేలిముసుగులు మర్చిపోతుందా?

33

కామం తీర్చుకోడానికి నీవెంత తెలివిగా నటిస్తున్నావు? కులటలకు కూడా నువ్వు ఇలాటివి నేర్పించగలవు.

34

నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుతూ ఉంది.

35

ఇంతా చేసినా నువ్వు “నేను నిర్దోషిని, యెహోవా కోపం నా మీదికి రాదులే” అని చెప్పుకుంటున్నావు.

36

నీ ప్రవర్తనలో మార్పును అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నావు?

37

ఆ జనం దగ్గర నుండి నిరాశతో చేతులు తలపై పెట్టుకుని తిరిగి వెళ్తావు.