పరిశుద్ధ గ్రంథము

యిర్మీయా 45

Jeremiah 45

చదవడం

యిర్మీయా 45

1

యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త యైన యిర్మీయా అతనితో చెప్పినది

🎙 రికార్డ్
2

బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు

🎙 రికార్డ్
3

కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసి యున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొను చున్నావు.

🎙 రికార్డ్
4

నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడునేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.

🎙 రికార్డ్
5

నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యిర్మీయా 45

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.