పరిశుద్ధ గ్రంథము

యోబు 18

Job 18

చదవడం

యోబు 18

1

అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను

🎙 రికార్డ్
2

మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు?మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.

🎙 రికార్డ్
3

మీ దృష్టికి మృగములుగానుమూఢులుగాను మేమెంచబడుట ఏల?

🎙 రికార్డ్
4

కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా,నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?

🎙 రికార్డ్
5

భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.

🎙 రికార్డ్
6

వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును

🎙 రికార్డ్
7

వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును.

🎙 రికార్డ్
8

వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.

🎙 రికార్డ్
9

బోను వారి మడిమెను పట్టుకొనునువల వారిని చిక్కించుకొనును.

🎙 రికార్డ్
10

వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.

🎙 రికార్డ్
11

నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయునుభయములు వారిని వెంటాడి తరుమును.

🎙 రికార్డ్
12

వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును.

🎙 రికార్డ్
13

అది వారి దేహ అవయవములను భక్షించునుమరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.

🎙 రికార్డ్
14

వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.

🎙 రికార్డ్
15

వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము చేయుదురువారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.

🎙 రికార్డ్
16

క్రింద వారి వేళ్లు ఎండిపోవునుపైన వారి కొమ్మలు నరకబడును.

🎙 రికార్డ్
17

భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరుమైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.

🎙 రికార్డ్
18

జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురుభూలోకములోనుండి వారిని తరుముదురు.

🎙 రికార్డ్
19

వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైననుఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడుఒకడైనను ఉండడు.

🎙 రికార్డ్
20

తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచివిస్మయమొందుదురుపూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.

🎙 రికార్డ్
21

నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టునుదేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యోబు 18

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.