పరిశుద్ధ గ్రంథము
యోవేలు 1
Joel 1
చదవడం
యోవేలు 1
పెతూయేలు కొడుకు యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.
పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి.
దాన్ని గురించి మీ పిల్లలకు చెప్పండి.
ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి.
తాగుబోతులారా, లేచి ఏడవండి.
ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది.
అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు.
తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు.
నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి.
పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది.
గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి,
ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి.
యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి!
ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి.
యెహోవా దినం దగ్గర పడింది.
మన కళ్ళముందే ఆహారం,
విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి,
మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి!
యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను.
కాలవలు ఎండిపోయాయి,