పరిశుద్ధ గ్రంథము

యోహాను 6

John 6

చదవడం

యోహాను 6

1

అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.

🎙 రికార్డ్
2

రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.

🎙 రికార్డ్
3

యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.

🎙 రికార్డ్
4

అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

🎙 రికార్డ్
5

కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని

🎙 రికార్డ్
6

యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

🎙 రికార్డ్
7

అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

🎙 రికార్డ్
8

ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ

🎙 రికార్డ్
9

ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

🎙 రికార్డ్
10

యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.

🎙 రికార్డ్
11

యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

🎙 రికార్డ్
12

వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.

🎙 రికార్డ్
13

కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

🎙 రికార్డ్
14

ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.

🎙 రికార్డ్
15

రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

🎙 రికార్డ్
16

సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

🎙 రికార్డ్
17

అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

🎙 రికార్డ్
18

అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.

🎙 రికార్డ్
19

వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;

🎙 రికార్డ్
20

అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.

🎙 రికార్డ్
21

కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

🎙 రికార్డ్
22

మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.

🎙 రికార్డ్
23

అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

🎙 రికార్డ్
24

కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

🎙 రికార్డ్
25

సముద్రపుటద్దరిని ఆయనను కనుగొనిబోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా

🎙 రికార్డ్
26

యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

🎙 రికార్డ్
27

క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

🎙 రికార్డ్
28

వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా

🎙 రికార్డ్
29

యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

🎙 రికార్డ్
30

వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

🎙 రికార్డ్
31

భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.

🎙 రికార్డ్
32

కాబట్టి యేసుపరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.

🎙 రికార్డ్
33

పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

🎙 రికార్డ్
34

కావున వారు ప్రభువా,యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.

🎙 రికార్డ్
35

అందుకు యేసు వారితో ఇట్లనెను - ''జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.

🎙 రికార్డ్
36

మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.

🎙 రికార్డ్
37

తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును.

🎙 రికార్డ్
38

నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.

🎙 రికార్డ్
39

"ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పొగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది."

🎙 రికార్డ్
40

కుమారుని చూచి ఆయనయందు విశ్వాస ముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.''

🎙 రికార్డ్
41

కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు -

🎙 రికార్డ్
42

ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా? - నేను పరలోకము నుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

🎙 రికార్డ్
43

అందుకు యేసు - ''మీలో మీరు సణుగుకొనకుడి;

🎙 రికార్డ్
44

నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

🎙 రికార్డ్
45

వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

🎙 రికార్డ్
46

దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.

🎙 రికార్డ్
47

విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు.

🎙 రికార్డ్
48

జీవాహారము నేనే.

🎙 రికార్డ్
49

మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

🎙 రికార్డ్
50

దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే.

🎙 రికార్డ్
51

పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

🎙 రికార్డ్
52

యూదులు- ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

🎙 రికార్డ్
53

"కావున యేసు ఇట్లనెను -''మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు."

🎙 రికార్డ్
54

నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

🎙 రికార్డ్
55

నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.

🎙 రికార్డ్
56

"నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము."

🎙 రికార్డ్
57

జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

🎙 రికార్డ్
58

ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను'' అనెను

🎙 రికార్డ్
59

ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను.

🎙 రికార్డ్
60

"ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి."

🎙 రికార్డ్
61

యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

🎙 రికార్డ్
62

అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు ?

🎙 రికార్డ్
63

"ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి, గాని"

🎙 రికార్డ్
64

"మీలో విశ్వసించనివారు కొందరున్నారు'' అని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటి నుండి యేసునకు తెలియును."

🎙 రికార్డ్
65

మరియు ఆయన - ''తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని'' అనెను.

🎙 రికార్డ్
66

"అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు."

🎙 రికార్డ్
67

కాబట్టి యేసు - ''మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?'' అని పన్నెండు మందిని అడుగగా.

🎙 రికార్డ్
68

"సీమోను పేతురు - ప్రభువా, ఎవనియొద్దకు వెళ్లుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;"

🎙 రికార్డ్
69

నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి యున్నామని ఆయనతో చెప్పెను.

🎙 రికార్డ్
70

అందుకు యేసు - ''నేను మిమ్మును పన్నెండు గురిని ఏర్పచు కొనలేదా? మీలో ఒకడు సాతాను'' అని వారితో చెప్పెను.

🎙 రికార్డ్
71

సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి ఆయనను అప్పగింపబోవు చుండెను గనుక వానిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యోహాను 6

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.