పరిశుద్ధ గ్రంథము

న్యాయాధిపతులు 20

Judges 20

చదవడం

న్యాయాధిపతులు 20

1

అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.

🎙 రికార్డ్
2

​దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి.

🎙 రికార్డ్
3

ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యా మీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులుఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని యడుగగా

🎙 రికార్డ్
4

చంప బడిన స్త్రీ పెనిమిటి యైన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమ నగాబెన్యామీనీయుల గిబియాలో రాత్రి బసచేయు టకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా

🎙 రికార్డ్
5

గిబియావారు నా మీ దికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి

🎙 రికార్డ్
6

నా ఉపపత్నిని బల వంతముచేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రా యేలీయులలో దుష్కార్య మును వెఱ్ఱిపనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని.

🎙 రికార్డ్
7

​ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను.

🎙 రికార్డ్
8

అప్పుడు జనులందరు ఏకీభవించి లేచిమనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు,

🎙 రికార్డ్
9

మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి

🎙 రికార్డ్
10

ఇశ్రాయేలీయులలో జరిగిన వెఱ్ఱితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పదిమంది మనుష్యులను, వెయ్యింటికి నూరుమందిని, పదివేలకు వెయ్యిమందిని ఏర్పరచుకొందము రండని చెప్పు కొనిరి.

🎙 రికార్డ్
11

​కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఒక్క మనుష్యు డైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధముచేయు టకు కూడిరి.

🎙 రికార్డ్
12

ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరియొద్దకు మను ష్యులను పంపి--మీలో జరిగిన యీ చెడుతనమేమిటి?

🎙 రికార్డ్
13

గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి; వారిని చంపి ఇశ్రాయేలీయులలోనుండి దోషమును పరిహరింప చేయుద మని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక

🎙 రికార్డ్
14

యుద్ధమునకు బయలు దేరవలెనని తమ పట్టణములలోనుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి.

🎙 రికార్డ్
15

ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందల మందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.

🎙 రికార్డ్
16

ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు.

🎙 రికార్డ్
17

బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు నాలుగులక్షలమంది లెక్కింపబడిరి; వీరందరు యోధులు.

🎙 రికార్డ్
18

వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీ యులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.

🎙 రికార్డ్
19

కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి.

🎙 రికార్డ్
20

ఇశ్రా యేలీయులు బెన్యామీనీయులతో యుద్ధముచేయ బయలు దేరి నప్పుడు ఇశ్రాయేలీయులు గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా

🎙 రికార్డ్
21

​బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికివచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో ఇరు వదిరెండు వేలమందిని నేల గూల్చిరి.

🎙 రికార్డ్
22

అయితే ఇశ్రా యేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగ వలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.

🎙 రికార్డ్
23

మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.

🎙 రికార్డ్
24

కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యా మీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవ దిన మున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు

🎙 రికార్డ్
25

గిబి యాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో పదు నెనిమిది వేలమందిని నేలగూల్చి సంహరించిరి.

🎙 రికార్డ్
26

వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహో వా సన్నిధిని అర్పించిరి.

🎙 రికార్డ్
27

ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను.

🎙 రికార్డ్
28

అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా,మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.

🎙 రికార్డ్
29

అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి.

🎙 రికార్డ్
30

మూడవ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయు లతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా

🎙 రికార్డ్
31

బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యు లను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.

🎙 రికార్డ్
32

​బెన్యామీనీయులు మునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరి గాని ఇశ్రాయేలీయులుమనము పారిపోయి వారిని పట్ట ణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి.

🎙 రికార్డ్
33

​ఇశ్రాయేలీయులందరు తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోటనుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి.

🎙 రికార్డ్
34

​అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్ప రచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు.

🎙 రికార్డ్
35

​అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యా మీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువది యయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు.

🎙 రికార్డ్
36

బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అప జయము కలిగినదని తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియామీద పెట్టిన మాటుగాండ్రను నమి్మ బెన్యా మీనీయులకు స్థలమిచ్చిరి.

🎙 రికార్డ్
37

మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోనివారి నందరిని హతముచేసిరి.

🎙 రికార్డ్
38

ఇశ్రాయేలీయులకును మాటు గాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి యుండెను; అదే దనగా వారు పట్టణములోనుండి పొగ గొప్ప మేఘమువలె లేచునట్లు చేయుటయే.

🎙 రికార్డ్
39

ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులువీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీ యులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.

🎙 రికార్డ్
40

అయితే పట్టణమునుండి ఆకాశముతట్టు స్తంభ రూపముగా పొగ పైకిలేవ నారంభింపగా బెన్యామీనీ యులు వెనుకతట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణ మంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను.

🎙 రికార్డ్
41

ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికొని విభ్రాంతినొంది

🎙 రికార్డ్
42

యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణము లలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి.

🎙 రికార్డ్
43

ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి.

🎙 రికార్డ్
44

అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.

🎙 రికార్డ్
45

అప్పుడు మిగిలినవారు తిరిగి యెడా రిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజ మార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.

🎙 రికార్డ్
46

ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.

🎙 రికార్డ్
47

ఆరువందలమంది తిరిగి యెడారి లోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి.

🎙 రికార్డ్
48

మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులమీదికి తిరిగి వచ్చి పట్టణనివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతముచేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

న్యాయాధిపతులు 20

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.