పరిశుద్ధ గ్రంథము
న్యాయాధిపతులు 5
Judges 5
చదవడం
న్యాయాధిపతులు 5
ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు,
ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు
రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!
యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు,
యెహోవా సముఖంలో కొండలు కంపించాయి.
అనాతు కొడుకు షమ్గరు దినాల్లో యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి.
దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు.
ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు. యుద్ధం వాళ్ళ ముఖ ద్వారాల దగ్గరికి వచ్చింది. ఇశ్రాయేలీయుల్లో నలభై వేలమందిలో
ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా తమకైతాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు.
తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ,
పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే స్వరాలు వినండి.
మేలుకో, మేలుకో దెబోరా, మేలుకో, మేలుకో, కీర్తన పాడు!
ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు
కొందరు ఎఫ్రాయీము నుంచి వచ్చినవాళ్ళు.
ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు.
గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు?
గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు.
జెబూలూనీయులకు మరణభయం లేదు.
రాజులు వచ్చి యుద్ధం చేశారు.
కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు.
కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు.
గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి.
యెహోవా దూత ఇలా అన్నాడు ‘మేరోజును శపించండి.’
కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది.
అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది.
పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది.
అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు.
సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది.
ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు.
‘కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా?
యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి.