పరిశుద్ధ గ్రంథము

లేవీయకాండము 11

Leviticus 11

చదవడం

లేవీయకాండము 11

1

మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

🎙 రికార్డ్
2

మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడిభూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;

🎙 రికార్డ్
3

జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని

🎙 రికార్డ్
4

​నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

🎙 రికార్డ్
5

పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

🎙 రికార్డ్
6

కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.

🎙 రికార్డ్
7

పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.

🎙 రికార్డ్
8

వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.

🎙 రికార్డ్
9

జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్ర ములో నేమి, నదులలో నేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.

🎙 రికార్డ్
10

సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచర ముల లోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలు సులు ఉండవో అవన్నియు మీకు హేయములు;

🎙 రికార్డ్
11

అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంస మును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.

🎙 రికార్డ్
12

నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.

🎙 రికార్డ్
13

పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,

🎙 రికార్డ్
14

క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,

🎙 రికార్డ్
15

ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,

🎙 రికార్డ్
16

​కపిరిగాడు, కోకిల,

🎙 రికార్డ్
17

​​ప్రతివిధమైన డేగ,

🎙 రికార్డ్
18

​పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,

🎙 రికార్డ్
19

​​సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.

🎙 రికార్డ్
20

రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరము లన్నియు మీకు హేయములు.

🎙 రికార్డ్
21

అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.

🎙 రికార్డ్
22

​నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.

🎙 రికార్డ్
23

​నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.

🎙 రికార్డ్
24

వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.

🎙 రికార్డ్
25

వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.

🎙 రికార్డ్
26

​రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.

🎙 రికార్డ్
27

నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;

🎙 రికార్డ్
28

వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును; అవి మీకు అపవిత్రమైనవి.

🎙 రికార్డ్
29

నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్ర మైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,

🎙 రికార్డ్
30

ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.

🎙 రికార్డ్
31

​ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

🎙 రికార్డ్
32

వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్ర మగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమే గాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయం కాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్ర మగును.

🎙 రికార్డ్
33

వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.

🎙 రికార్డ్
34

తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.

🎙 రికార్డ్
35

వాటి కళే బరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్ర మగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.

🎙 రికార్డ్
36

అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్ర మగును.

🎙 రికార్డ్
37

వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తన ములమీద పడినను అవి అపవిత్రములు కావు గాని

🎙 రికార్డ్
38

​ఆ విత్తన ములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.

🎙 రికార్డ్
39

మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

🎙 రికార్డ్
40

​దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.

🎙 రికార్డ్
41

నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.

🎙 రికార్డ్
42

నేలమీద ప్రాకు జీవరాసు లన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.

🎙 రికార్డ్
43

ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు.

🎙 రికార్డ్
44

నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.

🎙 రికార్డ్
45

నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

🎙 రికార్డ్
46

అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు

🎙 రికార్డ్
47

జంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరము లైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

లేవీయకాండము 11

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.