పరిశుద్ధ గ్రంథము

లూకా 8

Luke 8

చదవడం

లూకా 8

1

వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామము లోను సంచారము చేయుచుండగా

🎙 రికార్డ్
2

​పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.

🎙 రికార్డ్
3

​వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము4 చేయుచు వచ్చిరి.

🎙 రికార్డ్
4

​బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను

🎙 రికార్డ్
5

​విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను.

🎙 రికార్డ్
6

​మరి కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను.

🎙 రికార్డ్
7

​మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను.

🎙 రికార్డ్
8

​మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచువినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను.

🎙 రికార్డ్
9

​ఆయన శిష్యులుఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా

🎙 రికార్డ్
10

​ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి.)

🎙 రికార్డ్
11

​ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.

🎙 రికార్డ్
12

​త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమి్మ రక్షణ పొందకుండునట్లు అపవాది5 వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తి కొని పోవును.

🎙 రికార్డ్
13

​రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమి్మ శోధనకాలమున తొలగిపోవుదురు.

🎙 రికార్డ్
14

​ముండ్ల పొద లలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.

🎙 రికార్డ్
15

​మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్య మైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.

🎙 రికార్డ్
16

​ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును.

🎙 రికార్డ్
17

​తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయ బడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు.

🎙 రికార్డ్
18

​కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.

🎙 రికార్డ్
19

ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి.

🎙 రికార్డ్
20

అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.

🎙 రికార్డ్
21

అందుకాయనదేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.

🎙 రికార్డ్
22

మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.

🎙 రికార్డ్
23

వారు వెళ్లు చుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి

🎙 రికార్డ్
24

గనుక ఆయనయొద్దకు వచ్చిప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నా మని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమా యెను.

🎙 రికార్డ్
25

అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడిఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి

🎙 రికార్డ్
26

వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి.

🎙 రికార్డ్
27

ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.

🎙 రికార్డ్
28

వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడియేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను.

🎙 రికార్డ్
29

ఏలయనగా ఆయనఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను.

🎙 రికార్డ్
30

యేసునీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక,

🎙 రికార్డ్
31

వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.

🎙 రికార్డ్
32

అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.

🎙 రికార్డ్
33

అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.

🎙 రికార్డ్
34

మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.

🎙 రికార్డ్
35

జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.

🎙 రికార్డ్
36

అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా

🎙 రికార్డ్
37

గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.

🎙 రికార్డ్
38

అయితే ఆయననీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చె

🎙 రికార్డ్
39

జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చు కొనిరి.

🎙 రికార్డ్
40

అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి

🎙 రికార్డ్
41

యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.

🎙 రికార్డ్
42

అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ1 యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి

🎙 రికార్డ్
43

ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.

🎙 రికార్డ్
44

నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరునుమేమెరుగ మన్నప్పుడు, పేతురుఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా

🎙 రికార్డ్
45

యేసుఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసిన దనెను.

🎙 రికార్డ్
46

తాను మరుగై యుండలేదని, ఆ స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయ నను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను.

🎙 రికార్డ్
47

అందుకాయనకుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.

🎙 రికార్డ్
48

ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చినీ కుమార్తె చని పోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను.

🎙 రికార్డ్
49

యేసు ఆ మాటవినిభయపడవద్దు, నమి్మకమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి

🎙 రికార్డ్
50

యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.

🎙 రికార్డ్
51

అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో

🎙 రికార్డ్
52

ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చప్పెను.

🎙 రికార్డ్
53

ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి.

🎙 రికార్డ్
54

అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా

🎙 రికార్డ్
55

ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.

🎙 రికార్డ్
56

ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన-- జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

లూకా 8

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.