పరిశుద్ధ గ్రంథము

మార్కు 10

Mark 10

చదవడం

మార్కు 10

1

ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంత..ములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను.

🎙 రికార్డ్
2

పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకైపురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి.

🎙 రికార్డ్
3

అందుకాయనమోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను.

🎙 రికార్డ్
4

వారుపరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా

🎙 రికార్డ్
5

యేసుమీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని

🎙 రికార్డ్
6

సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను.

🎙 రికార్డ్
7

ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును;

🎙 రికార్డ్
8

వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.

🎙 రికార్డ్
9

కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.

🎙 రికార్డ్
10

ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి.

🎙 రికార్డ్
11

అందుకాయనతన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును.

🎙 రికార్డ్
12

మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.

🎙 రికార్డ్
13

తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి.

🎙 రికార్డ్
14

యేసు అది చూచి కోపపడిచిన్నబిడ్డలను నాయెద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే.

🎙 రికార్డ్
15

చిన్నబిడ్డ వలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి

🎙 రికార్డ్
16

ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.

🎙 రికార్డ్
17

ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూనిసద్బోధ కుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదు నని ఆయన నడిగెను.

🎙 రికార్డ్
18

యేసునన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.

🎙 రికార్డ్
19

నరహత్య చేయవద్దు, వ్యభిచ రింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోస పుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.

🎙 రికార్డ్
20

అందు కతడుబోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుస రించుచునే యుంటినని చెప్పెను.

🎙 రికార్డ్
21

యేసు అతని చూచి అతని ప్రేమించినీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమి్మ బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.

🎙 రికార్డ్
22

అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను.

🎙 రికార్డ్
23

అప్పుడు యేసు చుట్టు చూచిఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యు లతో చెప్పెను.

🎙 రికార్డ్
24

ఆయన మాటలకు శిష్యులు విస్మయ మొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెనుపిల్లలారా, తమ ఆస్తియందు నమి్మకయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;

🎙 రికార్డ్
25

ధన వంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.

🎙 రికార్డ్
26

అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణపొంద గలడని ఆయన నడిగిరి.

🎙 రికార్డ్
27

యేసు వారిని చూచిఇది మను ష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.

🎙 రికార్డ్
28

పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.

🎙 రికార్డ్
29

అందుకు యేసు ఇట్లనెనునా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు

🎙 రికార్డ్
30

ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

🎙 రికార్డ్
31

మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.

🎙 రికార్డ్
32

వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభ వింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి

🎙 రికార్డ్
33

ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింప బడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు.

🎙 రికార్డ్
34

వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమి్మవేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.

🎙 రికార్డ్
35

జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయ గోరుచున్నామని చెప్పగా

🎙 రికార్డ్
36

ఆయననేను మీకేమి చేయ గోరుచున్నారని వారి నడిగెను.

🎙 రికార్డ్
37

వారునీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయ చేయుమని చెప్పిరి.

🎙 రికార్డ్
38

యేసుమీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట యైనను మీచేత అగునా? అని వారి నడుగగా వారుమా చేత అగుననిరి.

🎙 రికార్డ్
39

అప్పుడు యేసునేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తి స్మము మీరు పొందెదరు, గాని

🎙 రికార్డ్
40

నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను.

🎙 రికార్డ్
41

తక్కినపదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి.

🎙 రికార్డ్
42

యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెనుఅన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును.

🎙 రికార్డ్
43

మీలో ఆలాగుండ కూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండ వలెను.

🎙 రికార్డ్
44

మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.

🎙 రికార్డ్
45

మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.

🎙 రికార్డ్
46

వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.

🎙 రికార్డ్
47

ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.

🎙 రికార్డ్
48

ఊరకుండుమని అ నేకులు వానిని గద్దించిరి గాని వాడుదావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను.

🎙 రికార్డ్
49

అప్పుడు యేసు నిలిచివానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచిధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచు చున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి.

🎙 రికార్డ్
50

అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను.

🎙 రికార్డ్
51

యేసునేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడు గగా, ఆ గ్రుడ్డివాడుబోధకుడా, నాకు దృష్టి కలుగ గగా, ఆ గ్రుడ్డివాడుబోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను.

🎙 రికార్డ్
52

అందుకు యేసునీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

మార్కు 10

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.