పరిశుద్ధ గ్రంథము

మార్కు 6

Mark 6

చదవడం

మార్కు 6

1

ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.

🎙 రికార్డ్
2

విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి?

🎙 రికార్డ్
3

ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.

🎙 రికార్డ్
4

అందుకు యేసుప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.

🎙 రికార్డ్
5

అందు వలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థ పరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.

🎙 రికార్డ్
6

ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.

🎙 రికార్డ్
7

ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారి కధికారమిచ్చి

🎙 రికార్డ్
8

ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక

🎙 రికార్డ్
9

చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొన వద్దనియు వారికాజ్ఞాపించెను.

🎙 రికార్డ్
10

మరియు ఆయన వారితో ఇట్లనెనుమీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి.

🎙 రికార్డ్
11

ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.

🎙 రికార్డ్
12

కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రక టించుచు

🎙 రికార్డ్
13

అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.

🎙 రికార్డ్
14

ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి వినిబాప్తిస్మమిచ్చు యోహాను మృతు లలోనుండి లేచియున్నాడుగనుక అతనియందు అద్భుత ములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.

🎙 రికార్డ్
15

ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరుఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.

🎙 రికార్డ్
16

అయితే హేరోదు వినినేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచి యున్నాడని చెప్పెను.

🎙 రికార్డ్
17

హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక

🎙 రికార్డ్
18

ఇత డామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను.

🎙 రికార్డ్
19

హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను.

🎙 రికార్డ్
20

ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు విని నప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను.

🎙 రికార్డ్
21

అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖు లకును విందు చేయించెను.

🎙 రికార్డ్
22

అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజునీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేన

🎙 రికార్డ్
23

మరియునీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను

🎙 రికార్డ్
24

గనుక ఆమె వెళ్లినేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమెబాప్తిస్మ మిచ్చు యోహాను తల అడుగుమనెను.

🎙 రికార్డ్
25

వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చిబాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టియిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను.

🎙 రికార్డ్
26

రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను.

🎙 రికార్డ్
27

వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి

🎙 రికార్డ్
28

పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను.

🎙 రికార్డ్
29

యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.

🎙 రికార్డ్
30

అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియ జేసిరి.

🎙 రికార్డ్
31

అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశ మునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున, భోజనము చేయుటకైనను

🎙 రికార్డ్
32

కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి.

🎙 రికార్డ్
33

వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి.

🎙 రికార్డ్
34

గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతు లను బోధింప సాగెను.

🎙 రికార్డ్
35

చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది;

🎙 రికార్డ్
36

చుట్టుపట్ల ప్రదేశ ములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమున కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపి వేయుమని చెప్పిరి.

🎙 రికార్డ్
37

అందుకాయనమీరు వారికి భోజనము పెట్టు డనగా వారుమేము వెళ్లి యీన్నూరు దేనారముల1 రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి.

🎙 రికార్డ్
38

అందుకాయనమీయొద్ద ఎన్ని రొట్టె లున్నవి? పోయి చూడుడనివారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి.

🎙 రికార్డ్
39

అప్పు డాయన పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా

🎙 రికార్డ్
40

వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి.

🎙 రికార్డ్
41

అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచి

🎙 రికార్డ్
42

వారందరు తిని తృప్తి పొందిన

🎙 రికార్డ్
43

తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి.

🎙 రికార్డ్
44

ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.

🎙 రికార్డ్
45

ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.

🎙 రికార్డ్
46

ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను.

🎙 రికార్డ్
47

సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను.

🎙 రికార్డ్
48

అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వా

🎙 రికార్డ్
49

ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలు వేసిరి.

🎙 రికార్డ్
50

అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించిధైర్యము తెచ్చు కొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.

🎙 రికార్డ్
51

తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;

🎙 రికార్డ్
52

అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు.

🎙 రికార్డ్
53

వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.

🎙 రికార్డ్
54

వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి

🎙 రికార్డ్
55

ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.

🎙 రికార్డ్
56

గ్రామముల లోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

మార్కు 6

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.