పరిశుద్ధ గ్రంథము

మత్తయి 14

Matthew 14

చదవడం

మత్తయి 14

1

ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని

🎙 రికార్డ్
2

ఇతడు బాప్తిస్మ మిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచి యున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను.

🎙 రికార్డ్
3

ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,

🎙 రికార్డ్
4

హేరోదు ఆమె నిమిత్తము యోహా నును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను.

🎙 రికార్డ్
5

అతడు ఇతని చంప గోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.

🎙 రికార్డ్
6

అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను

🎙 రికార్డ్
7

గనుకఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.

🎙 రికార్డ్
8

అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదైబాప్తిస్మ మిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను.

🎙 రికార్డ్
9

రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి

🎙 రికార్డ్
10

బంట్రౌ తును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను.

🎙 రికార్డ్
11

వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను.

🎙 రికార్డ్
12

అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతి పెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.

🎙 రికార్డ్
13

యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూ హములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి.

🎙 రికార్డ్
14

ఆయన వచ్చి ఆ గొప్ప సమూహ మును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.

🎙 రికార్డ్
15

సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చిఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయ మని చెప్పిరి.

🎙 రికార్డ్
16

యేసువారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా

🎙 రికార్డ్
17

వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి.

🎙 రికార్డ్
18

అందు క ాయనవాటిని నాయొద్దకు తెండని చెప్పి

🎙 రికార్డ్
19

పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.

🎙 రికార్డ్
20

వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి

🎙 రికార్డ్
21

స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

🎙 రికార్డ్
22

వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

🎙 రికార్డ్
23

ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయు టకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాల మైనప్పుడు ఒంటరిగా ఉండెను.

🎙 రికార్డ్
24

అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను.

🎙 రికార్డ్
25

రాత్రి నాలుగవ జామున ఆయన సము ద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను

🎙 రికార్డ్
26

ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

🎙 రికార్డ్
27

వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా

🎙 రికార్డ్
28

పేతురుప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

🎙 రికార్డ్
29

ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని

🎙 రికార్డ్
30

గాలిని చూచి భయపడి మునిగిపోసాగిఒ ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.

🎙 రికార్డ్
31

వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనిఅల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

🎙 రికార్డ్
32

వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.

🎙 రికార్డ్
33

అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.

🎙 రికార్డ్
34

వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.

🎙 రికార్డ్
35

అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి

🎙 రికార్డ్
36

వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

మత్తయి 14

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.