పరిశుద్ధ గ్రంథము

మత్తయి 9

Matthew 9

చదవడం

మత్తయి 9

1

తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా

🎙 రికార్డ్
2

ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా1 ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.

🎙 రికార్డ్
3

ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా

🎙 రికార్డ్
4

యేసు వారి తలంపులు గ్రహించిమీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?

🎙 రికార్డ్
5

నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?

🎙 రికార్డ్
6

అయినను పాప ములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ

🎙 రికార్డ్
7

వాడు లేచి తన యింటికి వెళ్లెను.

🎙 రికార్డ్
8

జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.

🎙 రికార్డ్
9

యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.

🎙 రికార్డ్
10

ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.

🎙 రికార్డ్
11

పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.

🎙 రికార్డ్
12

ఆయన ఆ మాటవినిరోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా.

🎙 రికార్డ్
13

అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చె

🎙 రికార్డ్
14

అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చిపరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయు చున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా

🎙 రికార్డ్
15

యేసుపెండ్లి కుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు.

🎙 రికార్డ్
16

ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపర చును చినుగు మరి ఎక్కువగును.

🎙 రికార్డ్
17

మరియు పాత తిత్తు లలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.

🎙 రికార్డ్
18

ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.

🎙 రికార్డ్
19

యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.

🎙 రికార్డ్
20

ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ

🎙 రికార్డ్
21

నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.

🎙 రికార్డ్
22

యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచికుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను.

🎙 రికార్డ్
23

అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి

🎙 రికార్డ్
24

స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.

🎙 రికార్డ్
25

జనసమూహ మును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.

🎙 రికార్డ్
26

ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.

🎙 రికార్డ్
27

యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చిదావీదు కుమారుడా, మమ్మును కనిక రించుమని కేకలువేసిరి.

🎙 రికార్డ్
28

ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా

🎙 రికార్డ్
29

వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయ నతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమి్మకచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలోఒ వారి కన్నులు తెరువబడెను.

🎙 రికార్డ్
30

అప్పుడు యేసుఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండిత ముగా ఆజ్ఞాపించెను.

🎙 రికార్డ్
31

అయినను వారు వెళ్లి ఆ దేశ మంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.

🎙 రికార్డ్
32

యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

🎙 రికార్డ్
33

దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి.

🎙 రికార్డ్
34

అయితే పరిసయ్యులుఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

🎙 రికార్డ్
35

యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామములయందును సంచారము చేసెను.

🎙 రికార్డ్
36

ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి

🎙 రికార్డ్
37

​కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు

🎙 రికార్డ్
38

గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

మత్తయి 9

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.