పరిశుద్ధ గ్రంథము

నెహెమ్యా 10

Nehemiah 10

చదవడం

నెహెమ్యా 10

1

మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా

🎙 రికార్డ్
2

శెరాయా అజర్యా యిర్మీయా

🎙 రికార్డ్
3

పషూరు అమర్యా మల్కీయా

🎙 రికార్డ్
4

హట్టూషు షెబన్యా మల్లూకు.

🎙 రికార్డ్
5

హారిము మెరేమోతు ఓబద్యా

🎙 రికార్డ్
6

దానియేలు గిన్నెతోను బారూకు

🎙 రికార్డ్
7

మెషుల్లాము అబీయా మీయామిను

🎙 రికార్డ్
8

మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు

🎙 రికార్డ్
9

లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు

🎙 రికార్డ్
10

వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను

🎙 రికార్డ్
11

మీకా రెహోబు హషబ్యా

🎙 రికార్డ్
12

జక్కూరు షేరేబ్యా షెబన్యా

🎙 రికార్డ్
13

హోదీయా బానీ బెనీను అనువారు.

🎙 రికార్డ్
14

జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ

🎙 రికార్డ్
15

బున్నీ అజ్గాదు బేబై

🎙 రికార్డ్
16

అదోనీయా బిగ్వయి ఆదీను

🎙 రికార్డ్
17

అటేరు హిజ్కియా అజ్ఞూరు

🎙 రికార్డ్
18

హోదీయా హాషుము బేజయి

🎙 రికార్డ్
19

హారీపు అనాతోతు నేబైమగ్పీ

🎙 రికార్డ్
20

యాషు మెషుల్లాము హెజీరు

🎙 రికార్డ్
21

మెషేజ బెయేలు సాదోకు యద్దూవ

🎙 రికార్డ్
22

పెలట్యా హానాను అనాయా

🎙 రికార్డ్
23

​హోషేయ హనన్యాహష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు

🎙 రికార్డ్
24

​రెహూము హషబ్నా మయశేయా

🎙 రికార్డ్
25

​అహీయా హానాను ఆనాను

🎙 రికార్డ్
26

మల్లూకు హారిము బయనా అనువారు.

🎙 రికార్డ్
27

అయితే జనులలో మిగిలినవారు,

🎙 రికార్డ్
28

అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయు లగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.

🎙 రికార్డ్
29

వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.

🎙 రికార్డ్
30

మరియుమేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయువారి కుమార్తెలను మా కుమా రులకు పుచ్చుకొనకయు నుందుమనియు

🎙 రికార్డ్
31

​దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందు మనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సర ములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.

🎙 రికార్డ్
32

మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.

🎙 రికార్డ్
33

​సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయ శ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.

🎙 రికార్డ్
34

మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.

🎙 రికార్డ్
35

మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలము లను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి

🎙 రికార్డ్
36

మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.

🎙 రికార్డ్
37

ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.

🎙 రికార్డ్
38

​లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,

🎙 రికార్డ్
39

​ఇశ్రా యేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షా రసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వార పాలకులును గాయకులును వాటిని తీసి కొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

నెహెమ్యా 10

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.