పరిశుద్ధ గ్రంథము

సంఖ్యాకాండము 26

Numbers 26

చదవడం

సంఖ్యాకాండము 26

1

ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషే కును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు కును ఈలాగు సెలవిచ్చెను

🎙 రికార్డ్
2

మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి.

🎙 రికార్డ్
3

కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రా యేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు

🎙 రికార్డ్
4

​మోయాబు మైదానము లలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.

🎙 రికార్డ్
5

ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;

🎙 రికార్డ్
6

పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;

🎙 రికార్డ్
7

వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.

🎙 రికార్డ్
8

​పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.

🎙 రికార్డ్
9

కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.

🎙 రికార్డ్
10

ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి.

🎙 రికార్డ్
11

అయితే కోరహు కుమారులు చావలేదు.

🎙 రికార్డ్
12

​షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీ యులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;

🎙 రికార్డ్
13

​జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు.

🎙 రికార్డ్
14

ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.

🎙 రికార్డ్
15

గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,

🎙 రికార్డ్
16

ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీ యులు ఏరీ వంశస్థులు;

🎙 రికార్డ్
17

ఆరోదీయులు ఆరోదు వంశ స్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.

🎙 రికార్డ్
18

వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు నలు బది వేల ఐదువందలమంది.

🎙 రికార్డ్
19

యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.

🎙 రికార్డ్
20

యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;

🎙 రికార్డ్
21

పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు

🎙 రికార్డ్
22

వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.

🎙 రికార్డ్
23

ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.

🎙 రికార్డ్
24

వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.

🎙 రికార్డ్
25

​జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;

🎙 రికార్డ్
26

​ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;

🎙 రికార్డ్
27

​వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.

🎙 రికార్డ్
28

​​యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.

🎙 రికార్డ్
29

మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు.

🎙 రికార్డ్
30

ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;

🎙 రికార్డ్
31

అశ్రీయేలీ యులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;

🎙 రికార్డ్
32

​షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.

🎙 రికార్డ్
33

హెపెరు కుమా రుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.

🎙 రికార్డ్
34

వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడు వందలమంది.

🎙 రికార్డ్
35

ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,

🎙 రికార్డ్
36

వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.

🎙 రికార్డ్
37

వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.

🎙 రికార్డ్
38

​బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

🎙 రికార్డ్
39

​అహీరామీయులు అహీరాము వంశస్థులు;

🎙 రికార్డ్
40

షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశ స్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.

🎙 రికార్డ్
41

వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.

🎙 రికార్డ్
42

దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;

🎙 రికార్డ్
43

వీరు తమ వంశములలో దానీయుల వంశ స్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.

🎙 రికార్డ్
44

ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;

🎙 రికార్డ్
45

బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;

🎙 రికార్డ్
46

ఆషేరు కుమార్తె పేరు శెరహు.

🎙 రికార్డ్
47

వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.

🎙 రికార్డ్
48

​నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు;

🎙 రికార్డ్
49

​యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.

🎙 రికార్డ్
50

వీరు నఫ్తాలీ యుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది

🎙 రికార్డ్
51

​ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.

🎙 రికార్డ్
52

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.

🎙 రికార్డ్
53

ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;

🎙 రికార్డ్
54

తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్య వలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రము లకు స్వాస్థ్యము ఇయ్యవలెను.

🎙 రికార్డ్
55

చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

🎙 రికార్డ్
56

ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్య మును వారికి పంచిపెట్టవలెను.

🎙 రికార్డ్
57

వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.

🎙 రికార్డ్
58

లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీ యుల వంశము కోరహీయుల వంశము.

🎙 రికార్డ్
59

కహాతు అమ్రా మును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.

🎙 రికార్డ్
60

అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.

🎙 రికార్డ్
61

నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.

🎙 రికార్డ్
62

వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువదిమూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్య బడలేదు.

🎙 రికార్డ్
63

యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.

🎙 రికార్డ్
64

మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండ లేదు.

🎙 రికార్డ్
65

ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

సంఖ్యాకాండము 26

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.