పరిశుద్ధ గ్రంథము

సంఖ్యాకాండము 33

Numbers 33

చదవడం

సంఖ్యాకాండము 33

1

మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.

🎙 రికార్డ్
2

మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.

🎙 రికార్డ్
3

​మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.

🎙 రికార్డ్
4

​అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.

🎙 రికార్డ్
5

​ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.

🎙 రికార్డ్
6

సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి.

🎙 రికార్డ్
7

ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.

🎙 రికార్డ్
8

పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.

🎙 రికార్డ్
9

​ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.

🎙 రికార్డ్
10

​ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.

🎙 రికార్డ్
11

ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

🎙 రికార్డ్
12

సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి

🎙 రికార్డ్
13

దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

🎙 రికార్డ్
14

ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.

🎙 రికార్డ్
15

​రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.

🎙 రికార్డ్
16

సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.

🎙 రికార్డ్
17

కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.

🎙 రికార్డ్
18

హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.

🎙 రికార్డ్
19

​రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.

🎙 రికార్డ్
20

రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.

🎙 రికార్డ్
21

లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.

🎙 రికార్డ్
22

​రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.

🎙 రికార్డ్
23

​కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.

🎙 రికార్డ్
24

​​షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.

🎙 రికార్డ్
25

​హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.

🎙 రికార్డ్
26

​మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.

🎙 రికార్డ్
27

తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

🎙 రికార్డ్
28

తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

🎙 రికార్డ్
29

మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.

🎙 రికార్డ్
30

​హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

🎙 రికార్డ్
31

​మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

🎙 రికార్డ్
32

బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

🎙 రికార్డ్
33

​హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.

🎙 రికార్డ్
34

యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.

🎙 రికార్డ్
35

ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

🎙 రికార్డ్
36

ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.

🎙 రికార్డ్
37

కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.

🎙 రికార్డ్
38

​యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

🎙 రికార్డ్
39

అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.

🎙 రికార్డ్
40

అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.

🎙 రికార్డ్
41

వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.

🎙 రికార్డ్
42

​సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.

🎙 రికార్డ్
43

పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.

🎙 రికార్డ్
44

​ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.

🎙 రికార్డ్
45

ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.

🎙 రికార్డ్
46

దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.

🎙 రికార్డ్
47

అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.

🎙 రికార్డ్
48

అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.

🎙 రికార్డ్
49

వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.

🎙 రికార్డ్
50

యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

🎙 రికార్డ్
51

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముమీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత

🎙 రికార్డ్
52

ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి

🎙 రికార్డ్
53

​ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.

🎙 రికార్డ్
54

మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.

🎙 రికార్డ్
55

అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.

🎙 రికార్డ్
56

మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

సంఖ్యాకాండము 33

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.