పరిశుద్ధ గ్రంథము

కీర్తనలు 12

Psalms 12

చదవడం

కీర్తనలు 12

1

యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరివిశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.

🎙 రికార్డ్
2

అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురుమోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

🎙 రికార్డ్
3

యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినిబింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.

🎙 రికార్డ్
4

మా నాలుకలచేత మేము సాధించెదముమా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు.

🎙 రికార్డ్
5

బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియుదరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదనురక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అనియెహోవా సెలవిచ్చుచున్నాడు.

🎙 రికార్డ్
6

యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.

🎙 రికార్డ్
7

యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవుఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించె దవు.

🎙 రికార్డ్
8

నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడుదుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

కీర్తనలు 12

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.