పరిశుద్ధ గ్రంథము

కీర్తనలు 140

Psalms 140

చదవడం

కీర్తనలు 140

1

యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి పింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము.

🎙 రికార్డ్
2

వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.

🎙 రికార్డ్
3

పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

🎙 రికార్డ్
4

యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపా డుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షిం పుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు.

🎙 రికార్డ్
5

గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)

🎙 రికార్డ్
6

అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము.

🎙 రికార్డ్
7

ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.

🎙 రికార్డ్
8

యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన సాగింపకుము. (సెలా.)

🎙 రికార్డ్
9

నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక

🎙 రికార్డ్
10

కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక

🎙 రికార్డ్
11

కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.

🎙 రికార్డ్
12

బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగు దును.

🎙 రికార్డ్
13

నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

కీర్తనలు 140

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.