పరిశుద్ధ గ్రంథము

కీర్తనలు 4

Psalms 4

చదవడం

కీర్తనలు 4

1

నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ముఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

🎙 రికార్డ్
2

నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు?ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?

🎙 రికార్డ్
3

యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి.నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.

🎙 రికార్డ్
4

భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)

🎙 రికార్డ్
5

నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి

🎙 రికార్డ్
6

మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.

🎙 రికార్డ్
7

వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి.

🎙 రికార్డ్
8

యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

కీర్తనలు 4

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.