పరిశుద్ధ గ్రంథము

రూతు 2

Ruth 2

చదవడం

రూతు 2

1

నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.

🎙 రికార్డ్
2

మోయాబీయురాలైన రూతునీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమెనా కూమారీ పొమ్మనెను.

🎙 రికార్డ్
3

​కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.

🎙 రికార్డ్
4

​బోయజు బేత్లెహేమునుండి వచ్చియెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారుయెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి.

🎙 రికార్డ్
5

​అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచిఈ చిన్నది ఎవరిదని అడుగగా

🎙 రికార్డ్
6

​కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడుఈమె మోయాబుదేశమునుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన ¸°వనురాలు.

🎙 రికార్డ్
7

​ఆమెనేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.

🎙 రికార్డ్
8

​అప్పుడు బోయజు రూతుతోనా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.

🎙 రికార్డ్
9

​​వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని ¸°వనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహ మగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.

🎙 రికార్డ్
10

​​అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొనిఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజునీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.

🎙 రికార్డ్
11

​​నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి.

🎙 రికార్డ్
12

​​యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.

🎙 రికార్డ్
13

​​అందుకు ఆమెనా యేలిన వాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమగలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.

🎙 రికార్డ్
14

​​​బోయజుభోజనకాలమున నీ విక్కడికి వచ్చిభోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.

🎙 రికార్డ్
15

​​​ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజుఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి

🎙 రికార్డ్
16

​​​మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞా పించెను.

🎙 రికార్డ్
17

​​​కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.

🎙 రికార్డ్
18

​​​ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను.

🎙 రికార్డ్
19

​​​అంతట ఆమె అత్త ఆమెతో­నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పిఎవని యుద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.

🎙 రికార్డ్
20

​​​నయోమిబ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉప కారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమిఆ మనుష్యుడు మనకు సమీపబంధు వుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా

🎙 రికార్డ్
21

​​​మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పని వారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.

🎙 రికార్డ్
22

​​​అప్పుడు నయోమి తన కోడలైన రూతుతోనా కుమారీ, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను.

🎙 రికార్డ్
23

​​​కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివ సించెను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

రూతు 2

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.