పరిశుద్ధ గ్రంథము

రూతు 4

Ruth 4

చదవడం

రూతు 4

1

బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజుఓయి, యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.

🎙 రికార్డ్
2

​బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడనిచెప్పగా వారును కూర్చుండిరి.

🎙 రికార్డ్
3

​అతడుమోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమి్మవేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.

🎙 రికార్డ్
4

​ఈ పుర నివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమ నగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన యెడల విడి పింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడునేను విడిపించెద ననెను.

🎙 రికార్డ్
5

​బోయజునీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా

🎙 రికార్డ్
6

​ఆ బంధు వుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టు కొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.

🎙 రికార్డ్
7

​ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని, క్రయవిక్రయములను గూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.

🎙 రికార్డ్
8

​​ఆ బంధువుడునీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా

🎙 రికార్డ్
9

​​బోయజుఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.

🎙 రికార్డ్
10

​​మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజ లందరితోను చెప్పెను.

🎙 రికార్డ్
11

​​అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలునుమేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;

🎙 రికార్డ్
12

​​ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ ¸°వనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.

🎙 రికార్డ్
13

​​కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.

🎙 రికార్డ్
14

​​అప్పుడు స్త్రీలుఈ దినమున నీకు బంధువుడు లేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.

🎙 రికార్డ్
15

​​నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.

🎙 రికార్డ్
16

అప్పుడు నయోమిఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.

🎙 రికార్డ్
17

ఆమె పొరుగు స్త్రీలునయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.

🎙 రికార్డ్
18

పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,

🎙 రికార్డ్
19

హెస్రోను రామును కనెను, రాము అమి్మనాదాబును కనెను, అమి్మనాదాబు నయస్సోనును కనెను,

🎙 రికార్డ్
20

నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,

🎙 రికార్డ్
21

బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,

🎙 రికార్డ్
22

​యెష్షయి దావీదును కనెను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

రూతు 4

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.