పరిశుద్ధ గ్రంథము
పరమగీతము 5
Song of Solomon 5
చదవడం
పరమగీతము 5
(యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు).
[నాలుగవ భాగం] (యువతి మాట్లాడుతూ ఉంది)
(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)
తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది.
నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను.
నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను.
పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు.
(యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)
(పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.)
(యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)
అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.
అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి.
అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి.
అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం.
అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి.
అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం.