పరిశుద్ధ గ్రంథము

తీతుకు 2

Titus 2

చదవడం

తీతుకు 2

1

నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధిం చుము.

🎙 రికార్డ్
2

ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలె ననియు,

🎙 రికార్డ్
3

ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును,మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,

🎙 రికార్డ్
4

యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు,

🎙 రికార్డ్
5

మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.

🎙 రికార్డ్
6

అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని ¸యౌవనపురుషులను హెచ్చరించుము.

🎙 రికార్డ్
7

పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

🎙 రికార్డ్
8

నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.

🎙 రికార్డ్
9

దాసులైనవారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంక రించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక,

🎙 రికార్డ్
10

ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చ రించుము.

🎙 రికార్డ్
11

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై

🎙 రికార్డ్
12

మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,

🎙 రికార్డ్
13

అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

🎙 రికార్డ్
14

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

🎙 రికార్డ్
15

వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూ ర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

తీతుకు 2

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.