పరిశుద్ధ గ్రంథము

జెకర్యా 13

Zechariah 13

చదవడం

జెకర్యా 13

1

ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును.

🎙 రికార్డ్
2

ఇదే సైన్య ములకధిపతియగు యెహోవా వాక్కుఆ దినమున విగ్ర హముల పేళ్లు ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రా త్మను దేశములో లేకుండచేతును.

🎙 రికార్డ్
3

ఎవడైనను ఇక ప్రవచ నము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులునీవు యెహోవా నామమున అబద్ధము పలుకు చున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు.

🎙 రికార్డ్
4

ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.

🎙 రికార్డ్
5

వాడునేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును.

🎙 రికార్డ్
6

నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.

🎙 రికార్డ్
7

ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.

🎙 రికార్డ్
8

దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.

🎙 రికార్డ్
9

ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

జెకర్యా 13

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.