పరిశుద్ధ గ్రంథము

జెఫన్యా 3

Zephaniah 3

చదవడం

జెఫన్యా 3

1

ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.

🎙 రికార్డ్
2

అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాస ముంచదు, దాని దేవునియొద్దకు రాదు.

🎙 రికార్డ్
3

​దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధి పతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.

🎙 రికార్డ్
4

​దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువు లను అపవిత్రపరతురు.

🎙 రికార్డ్
5

​​అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు

🎙 రికార్డ్
6

నేను అన్య జనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసి యున్నాను, జనము లేకుండను వాటియందెవరును కాపుర ముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.

🎙 రికార్డ్
7

దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకులోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.

🎙 రికార్డ్
8

కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నాకోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమ కూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.

🎙 రికార్డ్
9

అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.

🎙 రికార్డ్
10

చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసి కొని రాబడుదురు.

🎙 రికార్డ్
11

ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతో షించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు

🎙 రికార్డ్
12

దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును.

🎙 రికార్డ్
13

ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగల వారై అన్నపానములు పుచ్చుకొందురు;

🎙 రికార్డ్
14

సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.

🎙 రికార్డ్
15

తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.

🎙 రికార్డ్
16

ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;

🎙 రికార్డ్
17

నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.

🎙 రికార్డ్
18

నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.

🎙 రికార్డ్
19

ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,

🎙 రికార్డ్
20

ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

జెఫన్యా 3

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.