పరిశుద్ధ గ్రంథము

1 దినవృత్తాంతములు 2

1 Chronicles 2

చదవడం

1 దినవృత్తాంతములు 2

1

ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను

🎙 రికార్డ్
2

దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.

🎙 రికార్డ్
3

యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.

🎙 రికార్డ్
4

మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.

🎙 రికార్డ్
5

​పెరెసు కుమారులు హెస్రోను హామూలు.

🎙 రికార్డ్
6

జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.

🎙 రికార్డ్
7

కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.

🎙 రికార్డ్
8

​ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.

🎙 రికార్డ్
9

​​హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.

🎙 రికార్డ్
10

రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.

🎙 రికార్డ్
11

నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,

🎙 రికార్డ్
12

​బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,

🎙 రికార్డ్
13

​​యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

🎙 రికార్డ్
14

నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

🎙 రికార్డ్
15

​ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.

🎙 రికార్డ్
16

​సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.

🎙 రికార్డ్
17

అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.

🎙 రికార్డ్
18

హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.

🎙 రికార్డ్
19

అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.

🎙 రికార్డ్
20

​హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.

🎙 రికార్డ్
21

తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.

🎙 రికార్డ్
22

​సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.

🎙 రికార్డ్
23

మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.

🎙 రికార్డ్
24

కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.

🎙 రికార్డ్
25

​హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.

🎙 రికార్డ్
26

అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.

🎙 రికార్డ్
27

యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.

🎙 రికార్డ్
28

ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.

🎙 రికార్డ్
29

అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.

🎙 రికార్డ్
30

నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను

🎙 రికార్డ్
31

అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,

🎙 రికార్డ్
32

షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను.

🎙 రికార్డ్
33

యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.

🎙 రికార్డ్
34

​షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు

🎙 రికార్డ్
35

​షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.

🎙 రికార్డ్
36

అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,

🎙 రికార్డ్
37

జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,

🎙 రికార్డ్
38

ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,

🎙 రికార్డ్
39

అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,

🎙 రికార్డ్
40

ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,

🎙 రికార్డ్
41

​షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.

🎙 రికార్డ్
42

​యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

🎙 రికార్డ్
43

​​హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.

🎙 రికార్డ్
44

​షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.

🎙 రికార్డ్
45

​షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.

🎙 రికార్డ్
46

​​కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

🎙 రికార్డ్
47

​యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.

🎙 రికార్డ్
48

కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.

🎙 రికార్డ్
49

మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.

🎙 రికార్డ్
50

ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,

🎙 రికార్డ్
51

​బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.

🎙 రికార్డ్
52

కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.

🎙 రికార్డ్
53

కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.

🎙 రికార్డ్
54

​శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.

🎙 రికార్డ్
55

​యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

1 దినవృత్తాంతములు 2

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.