పరిశుద్ధ గ్రంథము

1 దినవృత్తాంతములు 7

1 Chronicles 7

చదవడం

1 దినవృత్తాంతములు 7

1

ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు

🎙 రికార్డ్
2

తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.

🎙 రికార్డ్
3

ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.

🎙 రికార్డ్
4

వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.

🎙 రికార్డ్
5

మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.

🎙 రికార్డ్
6

బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.

🎙 రికార్డ్
7

​బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.

🎙 రికార్డ్
8

​​బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.

🎙 రికార్డ్
9

​వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు.

🎙 రికార్డ్
10

యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.

🎙 రికార్డ్
11

యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.

🎙 రికార్డ్
12

షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.

🎙 రికార్డ్
13

నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.

🎙 రికార్డ్
14

మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడ కనెను.

🎙 రికార్డ్
15

మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.

🎙 రికార్డ్
16

మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.

🎙 రికార్డ్
17

ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.

🎙 రికార్డ్
18

మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.

🎙 రికార్డ్
19

​షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.

🎙 రికార్డ్
20

ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,

🎙 రికార్డ్
21

​తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.

🎙 రికార్డ్
22

​వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.

🎙 రికార్డ్
23

​తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.

🎙 రికార్డ్
24

​అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను.

🎙 రికార్డ్
25

​వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమా రుడు తెలహు, తెలహు కుమారుడు తహను,

🎙 రికార్డ్
26

​తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,

🎙 రికార్డ్
27

​ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.

🎙 రికార్డ్
28

​వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.

🎙 రికార్డ్
29

​మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామ ములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి.

🎙 రికార్డ్
30

​ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.

🎙 రికార్డ్
31

బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.

🎙 రికార్డ్
32

​హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.

🎙 రికార్డ్
33

యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.

🎙 రికార్డ్
34

షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.

🎙 రికార్డ్
35

వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.

🎙 రికార్డ్
36

​జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా

🎙 రికార్డ్
37

బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.

🎙 రికార్డ్
38

​ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.

🎙 రికార్డ్
39

​ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.

🎙 రికార్డ్
40

​ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

1 దినవృత్తాంతములు 7

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.