పరిశుద్ధ గ్రంథము
ద్వితీయోపదేశకాండము 32
Deuteronomy 32
చదవడం
ద్వితీయోపదేశకాండము 32
ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి.
నా ఉపదేశం వానలా కురుస్తుంది.
నేను యెహోవా పేరును ప్రకటిస్తాను.
ఆయన మనకు ఆశ్రయ దుర్గం.
వారు తమను తాము చెడగొట్టుకున్నారు.
బుద్ధి, ఇంగితం లేని మనుషులారా,
గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు,
యెహోవా వంతు ఆయన ప్రజలే.
ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు.
గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ
యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు.
లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు.
ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ,
యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు,
వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు.
వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు.
నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు,
యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు,
ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను.
దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు.
నా కోపాగ్ని రగులుకుంది.
వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను.
వారు కరువుతో అల్లాడతారు.
బయట కత్తి చావు తెస్తుంది.
వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను.
కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే,
ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ.
వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే,
వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే,
మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు.
వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది.
వారి ద్రాక్షారసం పాము విషం.
ఇది నా రహస్య ఆలోచన కాదా?
వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే.
బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే,
అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ?
వారికి ఆధారం లేనప్పుడు చూసి,
చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి.
ఆకాశం వైపు నా చెయ్యెత్తి
నేను తళతళలాడే నా కత్తి నూరి,
నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను.
ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి.
మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.
మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు.
తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.
ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు.
అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,
అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.
నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.
ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.
నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు.