పరిశుద్ధ గ్రంథము
యెషయా 1
Isaiah 1
చదవడం
యెషయా 1
యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం.
ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు.
ఎద్దుకు తన యజమాని తెలుసు.
ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా,
మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి?
అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు.
మీ దేశం పాడైపోయింది.
సీయోను కుమార్తె ద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా,
జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే,
సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి.
“యెహోవా ఇలా అంటున్నాడు.
మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు,
అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం.
మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం.
మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను.
మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.
మంచి చెయ్యడం నేర్చుకోండి.
యెహోవా ఇలా అంటున్నాడు.
మీరు ఇష్టపడి నాకు లోబడితే,
తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,
నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది!
నీ వెండి మలినమైపోయింది.
నీ అధికారులు ద్రోహులు.
కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు.
నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను.
మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను.
సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది.
అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు.
“మీరు కోరుకున్న సింధూర వృక్షాలను బట్టి మీరు సిగ్గుపడతారు.
మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు.
బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు.