పరిశుద్ధ గ్రంథము

యోబు 10

Job 10

చదవడం

యోబు 10

1

నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినదినేను అడ్డులేకుండ అంగలార్చెదనునా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

🎙 రికార్డ్
2

నా మీద నేరము మోపకుండుమునీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.

🎙 రికార్డ్
3

దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

🎙 రికార్డ్
4

నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా?

🎙 రికార్డ్
5

నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములవంటివా?

🎙 రికార్డ్
6

నేను దోషిని కాననియునీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు

🎙 రికార్డ్
7

నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?

🎙 రికార్డ్
8

నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించి యున్ననునీవు నన్ను మింగివేయుచున్నావు.

🎙 రికార్డ్
9

జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

🎙 రికార్డ్
10

ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదాజున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.

🎙 రికార్డ్
11

చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివిఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

🎙 రికార్డ్
12

జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివినీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.

🎙 రికార్డ్
13

అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివిఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

🎙 రికార్డ్
14

నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువునా దోషమునకు పరిహారము చేయకుందువు.

🎙 రికార్డ్
15

నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగునునేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొనినాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

🎙 రికార్డ్
16

­నేను సంతోషించినయెడలఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

🎙 రికార్డ్
17

సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవుఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవుఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

🎙 రికార్డ్
18

గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు;

🎙 రికార్డ్
19

అప్పుడు నేను లేనట్లే యుండియుందునుగర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

🎙 రికార్డ్
20

నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

🎙 రికార్డ్
21

అంధకారము మరణాంధకారముగల దేశమునకు

🎙 రికార్డ్
22

కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకుభ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకువెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందుకొంతసేపు నేను తెప్పరిల్లునట్లునన్ను విడిచి నా జోలికి రాకుండుము.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యోబు 10

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.