పరిశుద్ధ గ్రంథము

యోబు 11

Job 11

చదవడం

యోబు 11

1

అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను

🎙 రికార్డ్
2

ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా.వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?

🎙 రికార్డ్
3

నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?

🎙 రికార్డ్
4

నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.

🎙 రికార్డ్
5

దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు

🎙 రికార్డ్
6

ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువునీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.

🎙 రికార్డ్
7

దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?

🎙 రికార్డ్
8

అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?

🎙 రికార్డ్
9

దాని పరిమాణము బ ³ూమికంటె అధికమైనదిదాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది

🎙 రికార్డ్
10

ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసివ్యాజ్యెమాడ పిలిచినప్పుడుఆయన నడ్డగింప గలవాడెవడు?

🎙 రికార్డ్
11

పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదాపరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదోఆయనే తెలిసికొనును గదా.

🎙 రికార్డ్
12

అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగానిబుద్ధిహీనుడు వివేకికాడు.

🎙 రికార్డ్
13

నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడలనీ చేతులు ఆయనవైపు చాపినయెడల

🎙 రికార్డ్
14

పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచినయెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల

🎙 రికార్డ్
15

నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవునిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.

🎙 రికార్డ్
16

నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవుదాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లునీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.

🎙 రికార్డ్
17

అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించునుచీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.

🎙 రికార్డ్
18

నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు.నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.

🎙 రికార్డ్
19

ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.

🎙 రికార్డ్
20

దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదుప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యోబు 11

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.