పరిశుద్ధ గ్రంథము

యోబు 12

Job 12

చదవడం

యోబు 12

1

అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తర...మిచ్చెను

🎙 రికార్డ్
2

నిజముగా లోకములో మీరే జనులుమీతోనే జ్ఞానము గతించి పోవును.

🎙 రికార్డ్
3

అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నదినేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కానుమీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు?దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను

🎙 రికార్డ్
4

నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

🎙 రికార్డ్
5

దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు.కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.

🎙 రికార్డ్
6

దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లునుదేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగానుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.

🎙 రికార్డ్
7

అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించునుఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.

🎙 రికార్డ్
8

భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించునుసముద్రములోని చేపలును నీకు దాని వివరించును

🎙 రికార్డ్
9

వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడలయెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు?

🎙 రికార్డ్
10

జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.

🎙 రికార్డ్
11

అంగిలి ఆహారమును రుచి చూచునట్లుచెవి మాటలను పరీక్షింపదా?

🎙 రికార్డ్
12

వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు

🎙 రికార్డ్
13

జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవిఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

🎙 రికార్డ్
14

ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరుఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.

🎙 రికార్డ్
15

ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవునువాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.

🎙 రికార్డ్
16

బలమును జ్ఞానమును ఆయనకు స్వభావలక్షణములుమోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశ మున నున్నారు.

🎙 రికార్డ్
17

ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును.న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

🎙 రికార్డ్
18

రాజుల అధికారమును ఆయన కొట్టివేయునువారి నడుములకు గొలుసులు కట్టును.

🎙 రికార్డ్
19

యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొని పోవునుస్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.

🎙 రికార్డ్
20

వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయునుపెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.

🎙 రికార్డ్
21

అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.

🎙 రికార్డ్
22

చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచుమరణాంధకారమును వెలుగులోనికి రప్పించును

🎙 రికార్డ్
23

జనములను విస్తరింపజేయును నిర్మూలముచేయునుసరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును.

🎙 రికార్డ్
24

భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థక పరచునుత్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును.

🎙 రికార్డ్
25

వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురుమత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలచేయును.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యోబు 12

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.