పరిశుద్ధ గ్రంథము

యెహోషువ 15

Joshua 15

చదవడం

యెహోషువ 15

1

యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.

🎙 రికార్డ్
2

దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.

🎙 రికార్డ్
3

అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి

🎙 రికార్డ్
4

అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరి హద్దు.

🎙 రికార్డ్
5

దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.

🎙 రికార్డ్
6

ఆ సరిహద్దు బేత్‌ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.

🎙 రికార్డ్
7

ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమీ్మము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షే మెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను.

🎙 రికార్డ్
8

ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.

🎙 రికార్డ్
9

ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను.

🎙 రికార్డ్
10

ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.

🎙 రికార్డ్
11

ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను.

🎙 రికార్డ్
12

​పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే.

🎙 రికార్డ్
13

యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.

🎙 రికార్డ్
14

అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.

🎙 రికార్డ్
15

అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు.

🎙 రికార్డ్
16

కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా

🎙 రికార్డ్
17

కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.

🎙 రికార్డ్
18

​మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను.

🎙 రికార్డ్
19

​అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.

🎙 రికార్డ్
20

యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది.

🎙 రికార్డ్
21

దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణ ములు ఏవేవనగాకబ్సెయేలు

🎙 రికార్డ్
22

​ఏదెరు యా గూరు కీనాది

🎙 రికార్డ్
23

​మోనా అదాదా కెదెషు

🎙 రికార్డ్
24

​హాసోరు యిత్నాను జీఫు

🎙 రికార్డ్
25

​తెలెము బెయాలోతు క్రొత్త

🎙 రికార్డ్
26

​హాసోరు కెరీయోతు హెస్రోను

🎙 రికార్డ్
27

​అనబడిన హాసోరు అమాము

🎙 రికార్డ్
28

​​షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

🎙 రికార్డ్
29

బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా

🎙 రికార్డ్
30

బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము

🎙 రికార్డ్
31

ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా

🎙 రికార్డ్
32

​సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమి్మది.

🎙 రికార్డ్
33

​మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా

🎙 రికార్డ్
34

​జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

🎙 రికార్డ్
35

​యర్మూతు అదు ల్లాము శోకో అజేకా

🎙 రికార్డ్
36

​షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

🎙 రికార్డ్
37

​సెనాను హదాషా మిగ్దోల్గాదు

🎙 రికార్డ్
38

​దిలాను మిస్పే యొక్తయేలు

🎙 రికార్డ్
39

లాకీషు బొస్కతు ఎగ్లోను

🎙 రికార్డ్
40

కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు

🎙 రికార్డ్
41

​బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్ట ణములు.

🎙 రికార్డ్
42

​లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు

🎙 రికార్డ్
43

​​కెయీలా అక్జీబు మారేషా అనునవి,

🎙 రికార్డ్
44

వాటి పల్లెలు పోగా తొమి్మది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును,

🎙 రికార్డ్
45

ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,

🎙 రికార్డ్
46

దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,

🎙 రికార్డ్
47

గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,

🎙 రికార్డ్
48

మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు

🎙 రికార్డ్
49

శోకో దన్నా కిర్య త్సన్నా

🎙 రికార్డ్
50

అను దెబీరు అనాబు ఎష్టెమో

🎙 రికార్డ్
51

ఆనీము గోషెను హోలోను గిలో అనునవి,

🎙 రికార్డ్
52

వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు.

🎙 రికార్డ్
53

ఆరాబు దూమా ఎషాను

🎙 రికార్డ్
54

యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమి్మది పట్టణములు.

🎙 రికార్డ్
55

మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు

🎙 రికార్డ్
56

యొక్దె యాము జానోహ

🎙 రికార్డ్
57

కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.

🎙 రికార్డ్
58

హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు

🎙 రికార్డ్
59

బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

🎙 రికార్డ్
60

​కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.

🎙 రికార్డ్
61

​అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,

🎙 రికార్డ్
62

​వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

🎙 రికార్డ్
63

​​యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యెహోషువ 15

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.