పరిశుద్ధ గ్రంథము

యెహోషువ 16

Joshua 16

చదవడం

యెహోషువ 16

1

యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను,

🎙 రికార్డ్
2

తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.

🎙 రికార్డ్
3

అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.

🎙 రికార్డ్
4

అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి.

🎙 రికార్డ్
5

ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.

🎙 రికార్డ్
6

వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానా త్షీలోనువరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహావరకు తూర్పున దాని దాటి

🎙 రికార్డ్
7

యానో హానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను.

🎙 రికార్డ్
8

తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము.

🎙 రికార్డ్
9

ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్య బడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను.

🎙 రికార్డ్
10

అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

యెహోషువ 16

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.