పరిశుద్ధ గ్రంథము

లేవీయకాండము 17

Leviticus 17

చదవడం

లేవీయకాండము 17

1

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను.

🎙 రికార్డ్
2

నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగుచెప్పుముఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట

🎙 రికార్డ్
3

​ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహో వాకు అర్పణము అర్పించుటకు పూనుకొను వాడు అది ఎద్దేగాని గొఱ్ఱయేగాని మేకయేగాని

🎙 రికార్డ్
4

​ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళె ములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును;

🎙 రికార్డ్
5

వాడు రక్తమును ఒలికించిన వాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టి వేయబడవలెను.

🎙 రికార్డ్
6

​యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము నొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.

🎙 రికార్డ్
7

​వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.

🎙 రికార్డ్
8

​మరియు నీవు వారితో ఇట్లనుముఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను

🎙 రికార్డ్
9

​యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.

🎙 రికార్డ్
10

మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.

🎙 రికార్డ్
11

​రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

🎙 రికార్డ్
12

కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

🎙 రికార్డ్
13

మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివ సించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము;

🎙 రికార్డ్
14

దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

🎙 రికార్డ్
15

​మరియు కళే బరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశ మందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయం కాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.

🎙 రికార్డ్
16

​అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

లేవీయకాండము 17

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.