పరిశుద్ధ గ్రంథము

లేవీయకాండము 18

Leviticus 18

చదవడం

లేవీయకాండము 18

1

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను

🎙 రికార్డ్
2

నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.

🎙 రికార్డ్
3

మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.

🎙 రికార్డ్
4

మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.

🎙 రికార్డ్
5

మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.

🎙 రికార్డ్
6

మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదన మును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.

🎙 రికార్డ్
7

​నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

🎙 రికార్డ్
8

​నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.

🎙 రికార్డ్
9

​నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్క యైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.

🎙 రికార్డ్
10

నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయ కూడదు; అది నీది.

🎙 రికార్డ్
11

నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

🎙 రికార్డ్
12

నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదన మును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

🎙 రికార్డ్
13

నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.

🎙 రికార్డ్
14

నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.

🎙 రికార్డ్
15

నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయ కూడదు.

🎙 రికార్డ్
16

నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.

🎙 రికార్డ్
17

ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.

🎙 రికార్డ్
18

​నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.

🎙 రికార్డ్
19

అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.

🎙 రికార్డ్
20

నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.

🎙 రికార్డ్
21

​నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.

🎙 రికార్డ్
22

స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.

🎙 రికార్డ్
23

​ఏ జంతువు నందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.

🎙 రికార్డ్
24

​వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొన కూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి.

🎙 రికార్డ్
25

ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

🎙 రికార్డ్
26

కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,

🎙 రికార్డ్
27

అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,

🎙 రికార్డ్
28

యీ నా కట్ట డలను నా విధులను ఆచరింపవలెను.

🎙 రికార్డ్
29

ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టివేయబడుదురు.

🎙 రికార్డ్
30

కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొన కుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

లేవీయకాండము 18

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.